"కల్కి 2898 AD" ఈ సంవత్సరం ఇండియన్ సినిమాలలోనే టాప్..!

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ , కమల్ హాసన్ , రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , విజయ్ దేవరకొండ  ,దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ , శోభన ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ పై మొదటి నుండి భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 183.20 కోట్ల గ్రాస్ కలెక్షన్  లను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం విడుదల అయిన ఇండియన్ సినిమాలలో ఇదే టాప్ గ్రసర్ మరి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
కల్కి మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా 79.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ సంవత్సరం ఇండియా వ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరో గా రూపొందిన ఫైటర్ సినిమా 35.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో 3 వ స్థానంలో నిలవగా , అక్షయ్ కుమార్ , టైగర్ షార్ప్ హీరోలుగా రూపొందిన బడే మియా చోటే మియా సినిమా మొదటి రోజు 32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ 24.50 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది.  సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ 23.70 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన సైతాన్ సినిమా 21.75 కోట్ల కలెక్షన్లతో 7 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: