ఖరీదైన కారు కొన్న సలార్ నటుడు.. రేటు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ విభిన్నమైన వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కేవలం మలయాళం లోనే కాకుండా డైరెక్ట్ గా తెలుగు తమిళం వంటి భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇన్నాళ్లు మలయాళం లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఇప్పుడు తెలుగులో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనకు తెలుగులో విలన్ పాత్రలో నటించే అవకాశాలు

 కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. ఇటీవల యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు పృధ్విరాజ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో తన నాచురల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు ఆయన. సలార్ సినిమా తర్వాత ఆయన ది గొట్ సినిమాతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాని తెలుగులో సైతం రీమేక్ చేయగా ఆడు జీవితం అనే పేరుతో

 మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా ఈయన ఒక ఖరీదైన కారు కొనుగోలు చేసి నట్టుగా  తెలుస్తోంది. ఇక ఆ కారు ధర విన్న వారందరూ షాక్ అవుతున్నారు. మరి ఆ కారు ఏంటి.. దాని ధర ఎంత అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పృథ్వీరాజ్‏కు ఆటోమొబైల్స్ పై విపరీతమైన ఇష్టం ఉంది. ఇప్పటికే ఈహీరో వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కారు కొన్నాడు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ వద్ద ఉన్న లంబోర్గినీ కారు పృథ్వీరాజ్ దగ్గర కూడా ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా పృథ్వీరాజ్ 911GT3 పోర్షే కారును తీసుకున్నాడు. పోర్స్చే 911 GT3 అనేది పోర్స్చే వాహనం స్పోర్ట్స్ కార్లలో అధిక-పనితీరు గల హోమోలోగేషన్ మోడల్. ఈ లగ్జరీ వాహనం ధర దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: