'కల్కి' రాకకు కారణం అదేనా...?

FARMANULLA SHAIK
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ , ‘మహానటి’  వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్  కలయికలో ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.గురువారం (27/6/24)  రోజు ముందుకు రాబోతున్న ఈ చిత్రం టికెట్ల కోసం సోషల్ మీడియాలో ఏ రేంజ్ డిస్కషన్స్ నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే.తొలి రోజే ఈ సినిమా చూడాలని ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో సరైన సినిమా లేదు, మరి ఇంత కరువు కాలం తర్వాత వస్తున్నా మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర భాషల్లో కూడా ట్రెండ్ ఈ సినిమా పట్ల చాలా గట్టిగానే ఉంది.కాగా ఈ చిత్రంని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ఈ సినిమా లో భారీ తారాగణం తాను తీసుకున్నాడు.  ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.అశ్వినీదత్ కూతుర్లు అయిన ప్రియాంక దత్ , స్వప్న దత్లు కూడా సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇప్పటికే ‘కల్కి 2898 ad ‘ టీం ఇండస్ట్రీలో ఉన్న తమ సన్నిహితులకు స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన వారిలో కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలో 9 రకాల యుద్దాలకి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయట. కలియుగంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి..కల్కి..’ ఎలా వస్తాడు? అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందట. సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. కథలో భాగంగా వచ్చే బిట్ సాంగ్స్ కూడా గూంజ్ బంప్స్ తెప్పిస్తాయట. ప్రభాస్ డైనమిక్ ప్రెజెన్స్ హైలెట్ అని.. క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్స్ సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయని అంటున్నారు. మొత్తంగా ‘కల్కి..’ సినిమా ఓ గొప్ప అనుభూతి అని, అంతకు మించి ఏం చెప్పినా తక్కువే అవుతుందని వారు చెప్పుకొచ్చారు. మరి సినిమా వారు చెప్పిన స్థాయిలో ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: