జయం రవి దంపతులు విడిపోనున్నారా.. ఇదే ప్రూఫ్ కానుందా..?

MADDIBOINA AJAY KUMAR
తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో జయం రవి ఒకరు. ఈయన తెలుగు లో విజయం సాధించిన జయం మూవీ ని తమిళ్ లో జయం అనే పేరుతోనే రీమేక్ చేశాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు మంచి గుర్తింపు తమిళ సినీ పరిశ్రమంలో దక్కింది. దానితో ఈయనకు జయం రవి గా పేరు కూడా వచ్చింది. ఇక అప్పటి నుండి ఈయన జయం రవి గానే కంటిన్యూ అవుతున్నాడు. ఈయన హనుమాన్ జంక్షన్ , గాడ్ ఫాదర్ సినిమాలకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా యొక్క సోదరుడు. ఈయన తన తమ్ముడితో అనేక సినిమాలను తెరకెక్కించాడు.

అందులో జయం మూవీ కూడా ఒకటి. ప్రస్తుతం జయం రవి  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. సినీ పరిశ్రమలో అద్భుతమైన జోష్ లో ఉన్న సమయం లోనే జయం రవి 2009 వ సంవత్సరంలో ఆర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇన్ని సంవత్సరాల పాటు వీరి జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగింది. మరికొద్ది రోజుల్లోనే విడిపోబోతున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇక ఆ వార్తలకు బలం చేకూరేలా తాజాగా ఆర్తి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుండి జయం రవి తో ఉన్న అన్ని ఫోటోలను డిలీట్ చేసింది.

దానితో గత కొంత కాలంగా జయం రవి , ఆర్తి విడిపోతున్నారు అని వస్తున్న వార్తలకు బలం చేకూరింది. మరి నిజంగానే వీరిద్దరూ విడిపోతున్నారా..? మనస్పర్ధలు వచ్చిన కారణం గానే ఆర్తి తన సోషల్ మీడియా అకౌంట్ నుండి రవి ఫోటోలను డిలీట్ చేసిందా అనేది తెలియాలి అంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి. అంతవరకు ఈ వార్తలకు సంబంధించి ఏ విషయం క్లారిటీ లేనట్లే అవుతుంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో మాత్రం తమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న ఎంతో మంది నటీనటులు విడాకులు తీసుకొని విడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: