డి. శ్రీనివాస్ మృతి... ఫ్యామిలీలో న‌లిగిపోయిన కాక‌లు తీరిన నేత‌..?

praveen
తెలంగాణ రాజకీయాల్లో విషాదకర ఘటన జరిగింది. మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. హైదరాబాద్లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చివరికి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.  ఈ క్రమంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు అయిన ధర్మపురి శ్రీనివాస్ మృతి పై ఎంతో మంది రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

 అయితే ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక ఎన్నో కీలక పదవులను చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఎంపీగా, పిసిసి చీఫ్ గా కూడా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో ఆప్తుడిగా ధర్మపురి అరవింద్ కొనసాగేవారు. అయితే ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. నిజాంబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు.

 2015లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి ఇక బిఆర్ఎస్ లో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ అక్కడ ఇమడ లేకపోయినా ఆయన మళ్ళీ తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. కాగా ప్రస్తుతం ధర్మపురి శ్రీనివాస్ ఇద్దరు కుమారులు కూడా తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకరు బిజెపిలో కీలక నేతగా.. నిజాంబాద్ ఎంపీగా ఉండగా.. పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన నిజామాబాద్ మేయర్ గా కూడా పనిచేశారు. అయితే ఇలా కొడుకుల మధ్య సఖ్యత లేకపోవడం ఇద్దరు కొడుకులు కూడా చెరో పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఇక కుటుంబ వ్యవహారాల్లో డి శ్రీనివాస్ ఎంతగానో నలిగిపోయారు. అయితే ఎన్నోసార్లు కొడుకులను ఒక తాటి పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన ఆయన చేయలేకపోయారు. ఇలా రాజకీయాల్లో ఎంతో సాధించినా.. ఫ్యామిలీలో మాత్రం కొడుకులను ఒకే పార్టీలో పెట్టుకోలేకపోయిన నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కాగా ధర్మపురి అరవింద మృతి పై కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: