కల్కి 2898 AD : నార్త్ అమెరికాలో కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన కల్కి..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇక మొదటి నుండి ఈ సినిమాపై నార్త్ అమెరికా ప్రేక్షకులు కూడా మంచి ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నారు.
 

ఈ మూవీ విడుదల అయిన తర్వాత దీనికి మంచి టాక్ రావడంతో మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ మూవీ కి నార్త్ అమెరికాలో అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ ప్రకారం ఈ మూవీ కి నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి 10.5 మిలియన్ ప్లస్ కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. అలాగే ఇది ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ వీకెండ్ గ్రసర్ అని కూడా ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాకు నార్త్ అమెరికాలో మరికొన్ని రోజుల పాటు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కే అవకాశం ఉంది. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా , దిశా పటాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృనాల్ ఠాకూర్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ లో విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ ,  ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు. వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు స్వప్న దత్ ఈ మూవీ ని నిర్మించగా , సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: