తెలంగాణ: పేదలకు నీడగా ఇందిరమ్మ ఇల్లు ఉండగా..!

Pandrala Sravanthi
- కేసీఆర్ మరిచిన ఇండ్లను రేవంత్ రెడ్డి ఇస్తారా..?
- ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజలకు  మేలు కలుగుతుందా.?
- రేవంత్ సర్కార్ ముందున్న సవాలు ఇదేనా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం,ప్రత్యేక పాలనలో ఇబ్బందులు తప్పుతాయని ఎంతోమంది ప్రజలు భావించారు. కానీ కేసీఆర్ ఇబ్బందులు అన్నింటిని దూరం చేయలేకపోయారు. ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అలా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ కాదు కదా కనీసం సింగిల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాల్లో, పట్టణాల్లో ఇందిరమ్మ ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చింది కేవలం సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట తప్ప రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా ఇండ్లు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇదే తరుణంలో కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ వారిని నిందించింది. వారు అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని చెప్పింది. మరి కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి ప్రధాన సవాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
 పేదల ఇండ్ల కళను రేవంత్ నెరవేరుస్తాడా.?

 కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇల్లు లేని నిరుపేదలకు తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చింది.  దాని ప్రకారమే చాలామంది పేద ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు. దీంతో అద్భుత మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు గడిచినా కానీ ఇందిరమ్మ ఇండ్ల జాడలేదు. ఇప్పటికే వారిచ్చిన 6 గ్యారంటీలలో  మూడు గ్యారంటీలు అమలు అవుతున్నాయి. నాలుగవ గ్యారంటీ త్వరలోనే అమలుకు సిద్ధమవుతోంది. ఇందులో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు  తొందరలోనే వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు.  ముఖ్యంగా ఇండ్ల స్థలాలు ఉన్నవారికి 5లక్షలు, ఇండ్ల కోసం సహకారం అందిస్తుందని అంటున్నారు. కనీసం భూమి లేనటువంటి వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి మరీ ఇండ్లు అందిస్తుందట. తప్పకుండా ఈ స్కీం రాష్ట్రవ్యాప్తంగా అమలు అయితే రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు అనేవారు ఉండరు. దీనివల్ల రేవంత్ ప్రభుత్వం మరోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పేదలకు నిలువ నీడను ఇస్తే ఇందిరమ్మ కల సహకారం అయినట్టే అని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ రాజకీయ నాయకులు అనుకుంటున్నారు.  మరి చూడాలి కాంగ్రెస్ ఈ పథకాన్ని అమలు చేస్తుందా లేదంటే కేసీఆర్ లాగే మరుగున పడేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: