ఏపీ: గంజాయిపై ఉక్కు పాదం మోపకుంటే రాష్ట్రమాగం.!

Pandrala Sravanthi
- వైసిపి హయాంలో విచ్చలవిడి గంజాయి అమ్మకాలు..
- మత్తులో చిత్తవుతున్న యువత..
- ఉక్కు పాదం మోపాలమ్మ హోమ్ మినిస్టర్ అనిత..

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విచ్చలవిడిగా  అమ్ముడు అవుతున్న మత్తు పదార్థం గంజాయి.  దీని బారిన పడి ఎంతోమంది యువత  భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారు. మత్తులో పడి చిత్తవుతూ  కుటుంబాల్లో సమస్యలు తెచ్చి పెడుతున్నారు. కొంతమంది గంజాయి బారిన పడి దొంగతనాలు, మర్డర్లు, అత్యాచారాలు లాంటివి కూడా చేస్తున్నారు. అయినా గంజాయి అమ్మకాల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు పోలీసులు వారిపై ఉక్కు పాదం మోపడం లేదు. ఇప్పటికే గంజాయిని నిషేధిస్తూ గత ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా దీని అమ్మకాలకు మాత్రం పుల్ స్టాప్ పడడం లేదని చెప్పవచ్చు. గత జగన్ ప్రభుత్వంలో ఈ గంజాయి అమ్మకాలు అనేవి విచ్చలవిడిగా జరిగాయి. ఎంతో మంది యువత  దీని బారిన పడి జీవితాలను పాడు చేసుకున్నారు. మరి అలాంటి గంజాయి గురించి కొన్ని వివరాలు చూద్దాం.
 గంజాయిపై కొత్త సంస్కరణలు సీఎం బాబు తీసుకురావాల్సిందే.!

 గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి అమ్మకాలు అనేవి విచ్చలవిడిగా జరిగాయి. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు  వ్యవహరించారు తప్ప గంజాయి అమ్మకాలను ఆపలేకపోయారు. గ్రామాల నుంచి మొదలు పట్టణాల వరకు ఈ గంజాయికి ఎంతోమంది యువత బానిస అయ్యారు. అలాంటి గంజాయి పై గత ప్రభుత్వాలు కూడా ఎన్ని సంస్కరణలు, ఎన్ని చట్టాలు చేసినా  అమ్మకాలు ఆగలేదు. దీనిపై కొత్తగా ఏర్పడినటువంటి టిడిపి కూటమి ప్రభుత్వం ప్రత్యేక సంస్కరణలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.  ఇదే తరుణంలో రాష్ట్రంలో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి అనిత గంజాయిపై ఉక్కు పాదం మోపాలని అంటున్నారు. అంతేకాదు ఆమె కూడా గంజాయిపై ప్రత్యేక అవగాహన కలిగి ఉంది. ఇక్కడ గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందట.

గంజాయి అమ్మకాలను ఆపడానికి ఎన్ని సంస్కరణలైనా, ఎన్ని కొత్త చట్టాలైనా తీసుకురావడానికి ఆమె  ముందడుగు వేయడానికి సిద్ధం అయిపోయిందని తెలుస్తోంది. గంజాయి నివారించడం కోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని, పూర్తిగా గంజాయి దొరకని రాష్ట్రంగా ఏపీ ని తీర్చి దిద్దుతామని అంటుంది.  మరి దీనిని మాటలకే పరిమితం చేస్తుందా పనితనంలో కూడా చూపిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.ఒకవేళ గంజాయి రహిత రాష్ట్రంగా టీడీపీ కూటమి పని చేస్తే మాత్రం ప్రజల్లో వీరికి తిరుగుండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: