కన్నప్ప లో భారీ స్టార్ కాస్టింగ్.. మరి రజనీకాంత్..!?

Anilkumar
విలక్షణ ఉన్నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత చేసిన పలు సినిమాల్లో కామెడీ విలన్ గా చేశాడు. అలా అప్పటివరకు వరస సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాల్లో నటించి దాదాపుగా 500 సినిమాలకు పైగానే నటించి మెప్పించాడు అంతేకాదు. ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే మోహన్ బాబు వారసులుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు మంచు

 మనోజ్. ఇక ఈ ఇద్దరు కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ స్టార్డం మాత్రం తెచ్చుకోలేకపోయారు. ఒకప్పుడు ఈ హీరోలు చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం అంత యాక్టివ్గా సినిమాలను చేయడం లేదు. అందులో భాగంగానే సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విష్ణు తాజాగా అత్యంత భారీ బడ్జెట్ తో కన్నప్ప అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది.

నిజానికి కన్నప్ప సినిమాలో చాలామంది స్టార్ నటినటులు నటిస్తున్నారు. దేశంలో ఉన్న టాప్ నటీనటులు అందరూ ఇందులో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది .ఇప్పటికే చాలామంది రివిల్ చేశారు టీం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ బాబు చేయాల్సిన క్యారెక్టర్ ని రజనీకాంత్ చేత చేయిద్దామని అనుకున్నాడట. కానీ రజినీకాంత్ కి ప్రస్తుతం ఉన్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ ని పోషించలేనని చెప్పడంతో ఆ క్యారెక్టర్ కి మోహన్ లాల్ ను తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. లేకపోతే కన్నప్ప సినిమాలో రజనీకాంత్ ని కూడా మనం చూసి ఉండే వాళ్ళమని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: