సరిపోదా శనివారం విషయంలో ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్న నాని..!?

Anilkumar
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఇందులో నాచురల్ స్టార్ నాని సరసన కన్నడ బ్యూటీ గుమ్మ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. డివివి బ్యానర్ పై డివివి దానయ్య కళ్యాణ్ దాసరి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే అంటే సుందరానికి వంటి సూపర్ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో

 వస్తోంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా సోషల్ మీడియా వేదికగా భారీ రెస్పాన్స్ అందుకుంది. మ్యూజికల్ ప్రమోషన్ సైతం స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సైతం మంచి రెస్పాన్స్ అందుకుంది. కాగా ఇందులో నాని సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లేటెస్ట్ లుక్ ఒకటి విడుదల చేశారు చిత్ర బృందం. దీంతో ప్రస్తుతం ఆఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. నాని ఆ పోస్టర్‌లో పక్కింటి కుర్రాడి తరహాలో బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ

 రావడం కనిపించింది. ఇక సినిమా విషయానికి వస్తే..''వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న యాక్షన్‌ చిత్రమిది. దీంట్లో నాని పాత్ర రెండు కోణాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది'' అని చిత్రవర్గాలు తెలిపాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాని క్లాస్ లుక్ తో కనిపించడం ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసింది. దీంతో నాని ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడా? లేక ఒక్కడే రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: