వైఎస్సార్@75: వైఎస్సార్ రాజకీయ ప్రస్థానం సాగిందిలా...?

Suma Kallamadi

• నేడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ నేత జయంతి  

• మహానేతగా పేరొందిన వైఎస్ఆర్ జీవితం అందరికీ ఆదర్శం  

• ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం

(ఏపీ- ఇండియా హెరాల్డ్)

యడుగురి సందింటి రాజశేఖర రెడ్డి 1949, జులై 8న జన్మించారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన రాజకీయ జీవితం ఎలా సాగిందో తెలుసుకుందాం. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. అద్భుతమైన పరిపాలన కారణంగా మహానేతగా పేరు ఉండాలి కేంద్రంలోనూ చక్రం తిప్పారు. ఆరోగ్యశ్రీ, రియంబర్స్మెంట్ వంటి అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. వైఎస్ఆర్ లాంటి గొప్ప నేత మళ్లీ పుట్టబోరు అని చెప్పుకోవచ్చు.

రాజశేఖర రెడ్డి 1978లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి పులివెందుల నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. 1980లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 1982-83లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1983, 1985లో పులివెందుల నుంచి మళ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఇందిరాగాంధీ ఆయన్ను ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. వైఎస్ఆర్ కడప నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చిన ఆయన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలుపొందారు. 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2003లో 11 జిల్లాల్లో 60 రోజుల్లో 1,500 కిలోమీటర్లు మూడు నెలల పాటు పాదయాత్ర చేశారు. 

వైఎస్ఆర్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత విద్యుత్, పేద గ్రామీణ ప్రజలకు ఆరోగ్య బీమా వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఫ్రీ పబ్లిక్ అంబులెన్స్ సర్వీస్, గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు, గ్రామీణ పేదలకు సబ్సిడీ హౌజ్‌లు, చౌక బియ్యం, నిరుపేద విద్యార్థులకు కళాశాల ఫీజు రీయింబర్స్‌మెంట్, మైనారిటీలకు రిజర్వేషన్లు.

అతని పదవీకాలంలో రాష్ట్రంలో హింసాత్మక తీవ్రవాద నక్సలైట్ ఉద్యమం క్షీణించింది. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా 4 మిలియన్ హెక్టార్ల భూమికి సాగునీరు అందించేందుకు జల యజ్ఞం ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో 156 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని మళ్లీ విజయపథంలో నడిపించారు. 1969 తర్వాత కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో గెలిచిన మొదటి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా వైయస్సార్ రికార్డ్‌ క్రియేట్ చేశారు. 2009, మే 20న ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: