నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ 2 మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కావాల్సింది. పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న సినిమా వాయిదా పడనుండడంతో ఈ సినిమా వాయిదా ఎవరికి కలిసి రానుంది. ఎవరికి మైనస్ కానుంది. అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరి ఈ సినిమా విడుదల వాయిదా పడడం ఏ మూవీ కి కలిసి రానుంది. ఏ మూవీ లకు మైనస్ కానుంది అనే వివరాలను తెలుసుకుందాం.
పోయిన వారం రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇక ఈ వారం అఖండ 2 మూవీ విడుదల కానుండడంతో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కలెక్షన్లు భారీగా తగ్గుతాయి అని చాలా మంది అంచనా వేశారు. ఇక అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడడంతో మరి కొన్ని రోజుల పాటు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడడం ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కి కాస్త కలిసి వస్తుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇకపోతే అఖండ 2 మూవీ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ మూవీ కొత్త విడుదల తేదీని ఈ మూవీ నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీ ని డిసెంబర్ నెలలో విడుదల చేసినట్లయితే ఇప్పటికే డిసెంబర్ నెలలో విడుదల కావడానికి అనేక సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలన్నింటిపై అఖండ 2 మూవీ ద్వారా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఒక వేళ ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేసినట్లయితే సంక్రాంతి పండక్కు ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలకు ఈ సినిమా వల్ల భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని పలుకులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాను ఈ మూవీ నిర్మాతలు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి.