ఆ పండుగనే టార్గెట్ చేసిన చిరంజీవి.. విశ్వంభర రిలీజ్..?

Divya
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర. ఈ సినిమా సోసియో ఫాంటసి చిత్రంగా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదల అయ్యిందో అప్పటినుంచి ఈ సినిమా పైన చాలా దారుణమైన ట్రోల్స్ వినిపించాయి. ముఖ్యంగా చిరంజీవిని చూపించిన తీరు, గ్రాఫిక్స్ వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లుగా వార్తలు వినిపించాయి.


దీంతో మేకర్స్ ఈ సినిమా గ్రాఫిక్స్ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి తీర్చిదిద్దుతున్నట్లు వినిపిస్తున్నాయి. తాజాగా విశ్వంభర సినిమా గురించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. కేవలం ప్రకటనతోనే సరిపెట్టకుండా ఒక అద్భుతమైన విజువల్స్ తో మెగాస్టార్ చిరంజీవిని చూపించే విధంగా గ్లింప్స్ సిద్ధం చేస్తున్నారు. ఆ వీడియో ద్వారానే విడుదల తేదీని ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ వశిష్ట.

ఇక గ్రాఫిక్స్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఉండేలా చూస్తున్నారు. టీజర్ కి వచ్చిన కొన్ని నెగటివ్ కామెంట్స్ వల్ల అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా ఉండేలా హాలీవుడ్ స్థాయిలో అవుట్ ఫుట్ వచ్చేలా యువి క్రియేషన్ భారీ ఖర్చు చేసినట్లు సమాచారం. విశ్వంభర సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఉండేలా అలాగే హిట్లర్ సినిమాలోని సిస్టర్స్ సెంటిమెంట్ ని మరింత ప్రధాన బలంగా చూపించేలా చేస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా అలాగే ఆషికారంగనాథ్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితర నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరియు ఉగాది పండుగ రోజున ఎటువంటి గ్లింప్స్ విడుదల చేస్తారు అని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: