తేడా కొడితే ప్రాణం పోద్ధి.. ఎంత డబ్బుంటే మాత్రం ఎవరైనా ఇలా చేస్తారా?
అయితే ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం కొంతమంది చేసే పిచ్చి పనులు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా కఠిన ఘటన గురించే. ఇక్కడ వీడియోలో చూస్తున్న వ్యక్తి బాగా డబ్బున్న వ్యక్తి అన్నది చూస్తుంటే అర్థమవుతుంది. కానీ అతను చేసిన పని మాత్రం ఎవ్వరికి నచ్చడం లేదు. డబ్బు ఉంది కదా అని చేయకూడని విచిత్రమైన పని చేశాడు. ఏదైనా తేడా కొడితే చివరికి ప్రాణాలు కోల్పోయేవాడు. అతను మాత్రమే కాదు అతనితో పాటు మరికొంతమంది కూడా ప్రాణాలు పోయే ప్రమాదకరమైన పనిని అతను చేశాడు. చివరికి అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే మహేంద్ర స్కార్పియో ఎన్ అనే కారులో పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ నింపుకుంటున్నాడు ఒక వ్యక్తి. అయితే కారు యొక్క ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ అయినప్పటికీ పెట్రోల్ పంప్ ఆపకుండా ఇంకా ఫీల్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఏకంగా కారులో నుంచి ఫ్యూయల్ మొత్తం కింద పడిపోతూ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఇలా చేసి ఉంటాడు అన్న విషయం వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. ఎంత డబ్బులు ఉంటే మాత్రం ఇలాంటి పని చేయడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా తేడా కొడితే చివరికి ప్రాణాలు పోతాయి కదా అంటూ హెచ్చరిస్తున్నారు. కాగా ఈ వీడియో నిశాంత్ శర్మ అనే సోషల్ మీడియా ఖాతాలో షేర్ అయింది.