సచివాలయాలను అన్నా క్యాంటీన్లుగా.. మార్పు కరెక్టేనా..?

Divya

•సచివాలయాలను అన్న క్యాంటీన్లుగా మార్పు..
•మీ సేవా ప్రారంభంతో ప్రజలకు తిప్పలు తప్పవా
•చంద్రబాబు పునరాలోచన చేస్తే మంచిదేమో..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
జగన్ ప్రభుత్వంలో సచివాలయాలు కీలక పాత్ర పోషించాయి.. ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే ఆయా అవసరానికి సంబంధించిన శాఖలకు వెళ్లకుండా నేరుగా తమ ఊరిలో ఉండే సచివాలయాలకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా మార్పులు తీసుకొచ్చారు గత సీఎం జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యంగా పెన్షన్ మొదలుకొని భూ రిజిస్ట్రేషన్ ల వరకు చాలా పనులు తమ ఊరిలో ఉండే సచివాలయాల ద్వారానే పూర్తి చేసుకునేవారు ప్రజలు.. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడకుండా ఇలా ఒక గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకొచ్చారు.. ప్రతి ఊరిలో ఒక రెండంతస్తుల సచివాలయం నిర్మించి.. ప్రతి ఊరికి కొత్త హంగులు తీర్చిదిద్దారు.. ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పైగా ఆరోగ్య కేంద్రాలతో పాటు పశు వైద్యశాలను కూడా నిర్మించే ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఉపయోగం లేకుండా పోతున్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సచివాలయాలను అన్నా క్యాంటీన్లుగా మార్చబోతున్నారని... సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లతో పాటు పలు శాఖలకు తరలించనున్నారు అని స మాచారం. అంతేకాదు మీ సేవా సెంటర్లను తిరిగే ప్రారంభించే యోచన చేస్తున్నట్లు సమాచారం. మీ సేవాను తిరిగి ప్రారంభించే ఆలోచన మంచిదే కానీ మీసేవ దగ్గరకు వెళ్లి పెద్దవారు గంటల తరబడి తమ పనులను నెరవేర్చుకోవడానికి నిలబడాల్సి వస్తుంది. సమయం వృధా అవుతుంది. ఒక్కొక్కసారి ఆ పని వెళ్ళిన రోజే జరగకపోవచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు కాస్త ఇబ్బందిని కలిగించే అంశాలని చెప్పవచ్చు.
ఇక అంత పెద్ద భవనాలను అన్నా క్యాంటీన్ ల కోసం ఉపయోగించడం కొంచెం ఆలోచించదగిన విషయమే అని చెప్పాలి.. వేలకోట్లు ఖర్చు చేసి.. అత్యంత సుందరంగా.. ప్రజల అవసరాల కోసం  తీర్చిదిద్దిన సచివాలయాలను ప్రభుత్వ ఆఫీసులుగా మార్చకుండా అన్న క్యాంటీన్లుగా పేరు మార్చి ఉపయోగించడం సరైన నిర్ణయం కాదు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. సచివాలయాలు తీసేస్తే ఊర్లో ఉండే చాలామంది ప్రజలు తమ సమస్యలను నెరవేర్చుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ విషయంపై చంద్రబాబు కొంచెం పునరాలోచన చేస్తే బాగుంటుంది అని.. ప్రజల ఆలోచనలకు అవసరాలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: