కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో సందడి చేసిన "సోనూసూద్"..!

murali krishna
లాక్ డౌన్ హీరో సోనూసూద్, లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.... తన దాన ధర్మాలనయితే కొనసాగిస్తున్నాడు. తాజాగా మన చిత్తూరు రైతుకు ట్రాక్టర్ ఇచ్చి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. సోనూసూద్ ని చూసినప్పుడు అసలు అతని చేతికి ఎముక అనేది ఉందా అనే అనుమానం కలుగుతుంది.ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం, వేరే ప్రదేశంలో చిక్కుబడిపోయాముఅంటే ఇంటికి చేరుస్తున్నాడు సోనూసూద్. ఒకరకంగా సహాయం అని అర్థించిన అందరికి సహాయం చేస్తున్నాడు. ప్రజలు ప్రభుత్వాలను అడగడం వదిలేసిసోషల్ మీడియా వేదికగా సోనూసూద్ ను సాధారణ ప్రజలుఅడుగుతుండడం విశేషం.సోషల్ మీడియాలో అయితే ఏకంగా పన్నులు కూడా సోనూసూద్ కేకట్టమంటారా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా అందరి మన్ననలను అందుకుంటున్నారు సోను సూద్.అయితే తాజాగా హైదరాబాద్ వచ్చిన సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు. ఆమె తనను తాను ఈ స్థాయికి తెచ్చుకుందని వుమెన్ ఎంపవర్మెంట్ కి నిజమైన అర్థం ఇదేనని అన్నారు. కుటుంబాల కోసం స్త్రీలు ఎంత కష్టపడుతున్నారనేది కుమారి ఆంటీ సజీవ సాక్ష్యం అని సోనూసూద్ అన్నాడు. ఎవరి కుటుంబాలైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్ళు కుమారి ఆంటీని చూసి నేర్చుకోవాలని ఇబ్బందుల్లో కూడా సరైన దారి ఎంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోకపోవచ్చు అని నిరూపించిందని అన్నారు. తాను వెజిటేరియన్ తింటానని ప్లేట్ ఎంత అని అడిగితే కుమార్ ఏంటి 80 రూపాయలు అని చెప్పింది. అయితే తనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు అని అడిగితే మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పుకొచ్చింది. అయితే నాకు లాటరీ తగిలింది ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని సోనూసూద్ అంటే మీరు ఎంతోమందికి సాయం చేశారు మీకు మేము ఎంత పెట్టినా తక్కువే అని కుమారి ఆంటీ చెప్పు వచ్చింది. ఇక ఈ సందర్భంగా కుమారి ఆంటీని సోను సత్కరించాడు. తర్వాత కుమారి ఆంటీ కుమార్తె యామిని, కుమారుడు ధనుష్ తో కలిసి ఫోటోలు దిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: