షాక్: క్షమాపణలు చెప్పిన సమంత.. ఏం జరిగిందంటే..?

Divya
సాధారణంగా సెలబ్రిటీలు ఏదైనా యాడ్స్ చేశారంటే చాలు అభిమానులు తెగ వాటిని ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే యాడ్స్ చేసేటప్పుడు సెలబ్రిటీలు మేమే వాడుతున్నాం అన్నట్టుగా తెలియజేస్తూ ఉంటారు. నిజంగానే వాడుతుంటారంటే అలాంటిదేమీ లేదని కూడా చెప్పవచ్చు.. కేవలం డబ్బులు తీసుకుంటారు తామే వాడుతున్నాం అన్నట్లుగా నటిస్తూ ఉంటారు. అయితే గతంలో ఇవన్నీ బాగానే ఉండేవి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చెడు వ్యాసనాలకు సంబంధించి, ప్రజలకు ఏదైనా హాని కలిగించేటువంటి వాటిని ప్రమోట్ చేస్తే కేసులు వంటివి అవుతూ ఉన్నాయి.


సోషల్ మీడియా యుగం అయినప్పటికీ ఇప్పుడు ఇలాంటి వాటిపైన ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉన్నారు.. దీంతో ఇలాంటి ఒక ప్రశ్నకే హీరోయిన్ సమంత క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. గతంలో తెలియక తప్పులు చేసే క్షమించండి.. సమంత ఒక నెటిజన్ ప్రశ్నకు సమాధానాన్ని తెలిపింది.. గతంలో తాను తప్పులు చేసిన మాట నిజమే.. కానీ అవి తెలిసి చేసినవి కాదు.. వాటి గురించి తెలిశాక ఆ ట్రాన్స్ ప్రమోషన్లను సైతం ఆపేశానని తెలిపింది. ప్రస్తుతం తాను ఏదైతే చేస్తున్నదో వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానంటూ సమంత వెల్లడించింది.

ఆరోగ్యానికి హానికరమైన బ్రాండ్లను సైతం ఎందుకు ప్రమోట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా.. సమంత ఈ క్షమాపణలను తెలియజేసిందట.. అయితే సమంత గతంలో చేసిన ఒక యాడ్ గురించి ఇలా చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అభిమానులు ఈ విషయం తెలిసి సమంతను అభినందిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సమంత గతంలో చేసిన ఆ యాడ్ ఏంటి అని తెగ వెతికేస్తున్నారు. సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సమంత తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం హాలీవుడ్ , బాలీవుడ్ వైపుగా పెట్టినట్టుగా కనిపిస్తోంది అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: