కూల్చివేత‌ల కూట‌మి స‌ర్కార్‌: చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవన్ని పనికిమాలిన పనులేనా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో చంద్రబాబు పడ్డారు. అదే సమయంలో... గత ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీని... వైసిపి ఎలా ఇబ్బంది పెట్టింది,? ఎలాంటి కక్ష సాధింపులు చేసింది అనే దానిపై కూడా చంద్రబాబు ఫోకస్ చేశారు. దానికి తగ్గట్టుగానే రివెంజ్ పాలిటిక్స్ కూడా టిడిపి దిగుతోంది.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా... జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన  ఋషికొండ భవనాలపై.. అనేక ప్రచారాలు చేసింది టిడిపి. అక్కడితో ఆగకుండా వైసిపి పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకుంది.  తాడేపల్లి లోని వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా... కూల్చేసింది టిడిపి సర్కార్. అటు...  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి పార్టీ కార్యాలయాలకు నోటీసులు కూడా ఇష్యూ చేయించింది టిడిపి ప్రభుత్వం.
 

అక్రమంగా కట్టారని, అనుమతులు లేకుండా కట్టారని..  ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీసులో నిర్మించారని... ఇలా అనేక రకాల కారణాలు చెప్పి.. నోటీసులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. అక్కడితో ఆగకుండా... తాజాగా.. టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి ఓవరాక్షన్ చేశాడు. వైసీపీకి చెందిన  ఎంపీపీ నాగలక్ష్మి కుటుంబానికి చెందిన ఓ భాగాన్ని టార్గెట్ చేశారు కొలికపూడి.  అంతేకాదు ఆ భవనాన్ని దగ్గరుండి జెసిబి లతో  ధ్వంసం చేయించారు.
ఇలా ఎక్కడపడితే అక్కడ వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ ఇండ్లను కూల్చే చేస్తున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కూటమి పార్టీ నేతలు... వైసిపిని ఇదే అంశంపై ప్రశ్నించాయి. వైసిపి ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అంటూ పవన్ కళ్యాణ్ కూడా  విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా.. అలాగే వ్యవహరిస్తోంది. దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు. చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి పనికిమాలిన పనులు అంటూ... కూటమిపై ఫైర్ అవుతున్నారు. ప్రజా పాలన చేసి వైసిపిని దెబ్బ కొట్టాలి కానీ... కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: