ఇండియన్ 2 రన్ టైం అంతసేపా... శంకర్ రిస్క్ చేస్తున్నావేమో..!?

Anilkumar
లోకనాయకుడు కమలహాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ సినిమా ఇండియన్ 2. ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. అయితే ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియా వేదికగా భారీ స్పందన వచ్చింది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని కూడా

 నిర్వహించారు చిత్రబంధం. మరోవైపు దీనికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను  హైదరాబాదులో పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు సైతం చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది. ఇందులో భాగంగానే ఇండియన్ టు సినిమాకి సంబంధించిన రన్ టైం నిడివి 180 నిమిషాలు అన్నట్లుగా తెలుస్తోంది. చాలా ఆలస్యంగా వస్తున్న ఈ సినిమా మరి ప్రేక్షకులను దాదాపుగా మూడు గంటల పాటు సీట్లల్లో కూర్చోబెడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన

 కల్కి సినిమా సైతం మూడు గంటలు ఉంది. ఐతే  ఈ సినిమాలో గ్రాఫిక్స్ అలాగే చాలామంది స్టార్ యాక్టర్లు వారితోపాటు ప్రభాస్ యాక్టింగ్ సైతం అద్భుతంగా ఉండడంతో మూడు గంటలు సినిమా చూడడానికి ఇష్టపడ్డారు. మరి ఇండియన్ టు సినిమాలో కూడా ఇదే జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండియన్‌ 2లో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, సముద్రఖని, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు.  ఇక ఈనెల 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా వేగం పెంచబోతున్నారు చిత్ర బృందం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: