సరైన సమయం చూసి రంగంలోకి దిగుతున్న కింగ్ నాగార్జున!

Suma Kallamadi

తెలుగు చిత్ర పరిశ్రమలో మన్మధుడు అని పిలిచిన, కింగ్ అని పిలిచినా ఒకేఒక్కరు అందరికీ గుర్తుకొస్తాడు... ఆయనే అక్కినేని నాగార్జున. తనదైన స్టైల్, నటనతో అక్కినేని నాగేశ్వరరావు వారసుడైన నాగార్జున తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన ఎన్నో రకాలైన భక్తిరస చిత్రాలను చేయడం జరిగింది. అందులో అన్నమయ్య అనే సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇదే కోవకు చెందిన శ్రీరామదాసు సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలియంది కాదు.

ఇక విషయం ఏమిటంటే... కింగ్ నాగార్జున అటువంటి భక్తిరస చిత్రాలను చేసి చాలా సంవత్సరాలు గడిచింది. ఈ నేపథ్యంలో ఆయన రాబోయే చిత్రాలలో ఒకటి అర చిత్రమైన దేవుడికి సంబంధించిన కంటెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దానికి కారణం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మన తెలుగులో ఎక్కువగా పురాణ ఇతిహాసాలు బేస్ చేసుకుని అనేక కథలు తెరకెక్కుతున్నాయి. అంతేకాకుండా ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. అందుకనే భక్తిరస చిత్రాలు చేయడానికి కింగ్ నాగార్జున ఇదే మంచి తరుణం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకనే నాగార్జున ప్రస్తుతం మైథాలజీకి సంబంధించిన స్క్రిప్టులు వింటున్నట్టు సమాచారం. కాబట్టి మీలో ఎవరైనా ఉత్సాహవంతమైన రైటర్లు మైథాలజీకి సంబంధించిన కంటెంట్ ని కలిగి ఉన్నట్లయితే, అన్నపూర్ణ స్టూడియోస్ వారిని సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవును .. అక్కినేని నాగార్జున రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్వరలో ఓ భక్తిరస చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దానికోసం అని ప్రస్తుతం ఓ టీంని సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు టాలీవుడ్ సమాచారం. కాబట్టి మీరు ఎవరికైనా రైటింగ్ పట్ల ఆసక్తి ఉన్న, దేవుడికి సంబంధించిన కథలు మీ దగ్గర ఉన్న, వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ వారిని సంప్రదిస్తే మీకు తగిన మూల్యం చెల్లించబడును.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: