లోకేష్‌ రెడ్‌ బుక్‌: 2,3 నెలలు జైల్లోనే జోగి రమేష్‌ ?

Veldandi Saikiran

అగ్రిగోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు జోగి రమేష్‌. సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారని  ఈ సందర్భంగా ప్రశ్నించారు. సీజ్ చేసిన భూమి నెంబర్ పై అమ్మకాలు జరగవని స్పష్టం చేశారు. నేను కొన్న భూములు పేపర్ ప్రకటన ఇచ్చి సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేసారని తెలిపారు.

కూటమి అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని వివరించారు. నాపై ఆరోపణలలో నిజం లేదు కాబట్టి ఇప్పటి దాక యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. ఎలా అయినా అరెస్ట్ చేయాలనీ తప్పుడు కేసులు పెట్టడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. లోకేష్ రెడ్ బుక్ అంటూ ఎలా అయినా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనీ చూస్తున్నారని... నిప్పులు చెరిగారు. మహా అయితే అరెస్ట్ చేసి 2,3 నెలలు జైల్లో పెడతారు అంతే కదా అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జోగి రమేష్.

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచి కోసం పని చేయండి అని చురకలు అంటించారు. ఇలా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చుస్తే మంచిది కాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు పని చేస్తే మంచిదని వెల్లడించారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమన్నారు. గతంలో టీడీపీ వాళ్ళు జగన్ ని బూతులు తిడితే నిరసన చెప్పడం కోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళానని గుర్తు చేశారు.

చంద్రబాబు ఇంటి మీద దాడికి నేను వెళ్ళలేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. కేవలం నిరసన చెప్పడానికి వెళ్ళాను....నా మీద దాడి చేసి నా కారు పగలగొట్టారని ఆగ్రహించారు మాజీ మంత్రి జోగి రమేష్. వైఎస్సార్ స్ఫూర్తి నుండి పుట్టిన పార్టీ వైస్సార్సీపీ అని... జగన్  రాష్ట్ర అభివృద్ధి కోసం పేద ప్రజల కోసం పని చేసారని కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: