మహిళలను థియేటర్ల బాట పట్టించడంలో 'విక్టరీ' గా నిల్చిన వెంకటేష్.!
* శోభన్ బాబు తర్వాత వెంకటేష్ అనేలా మహిళా ప్రేక్షకుల ఆదరణ.!
* 'నువ్వు నాకు నచ్చావ్'లో బయటపడ్డ కామెడీ కోణం.!
* సినీ కేరిర్లో 6 ఫిల్మ్ ఫేర్, 5 నంది అవార్డ్స్.!
(ఏపీ-ఇండియాహెరాల్డ్): 'విక్టరీ' వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అవసరంలేని పేరు. టాలీవుడ్ లో ఉన్న రెండో జనరేషన్ స్టార్ హీరోల్లో ఒకరుగా ఎదిగిన వెంకటేష్ తెలుగు పరిశ్రమలో అనుకోకుండా హీరోగా అడుగు పెట్టి వరుస విజయాలలో విక్టరీగా ఎదిగి చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున అనే మూడు స్తంభాల ప్రక్కన నాలుగో స్తంభముగా అగ్ర తాంబూలం అందుకున్న హీరోననే గర్వం కూడా లేకుండా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకొని 59 సంవత్సరాల వయసులో కూడా యువకుడిలా ముందుకు దూసుకుపోతున్నారు విక్టరీ వెంకటేష్. ఆయన తన 37ఏళ్ళ సినీ కేరిర్ ప్రారంభంలో మాస్ తరహా పాత్రలు చేసి మెప్పించారు. 1986లో కలియుగ పాండవులు సినిమాతో తన సినీ కేరిర్ ప్రారంభించారు.తన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు.ఆ తర్వాత వరుసగా బ్రహ్మరుద్రుడు, అజేయుడు, భారతంలో అర్జునుడు, త్రిమూర్తులు, విజేత విక్రమ్, శ్రీనివాస కళ్యాణం....లాంటి ఎన్నో యాక్షన్ సినిమాలు చేస్తూనే స్వర్ణకమలం లాంటి క్లాసికల్ సినిమాలు కూడా చేసి మెప్పించారు. ఆతర్వాత చేసిన ప్రేమ, ధ్రువనక్షత్రం వంటి సినిమాలు హిట్ గా నిల్చాయి.
1990లో వచ్చిన 'బొబ్బిలి రాజ' తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టాడు వెంకటేష్.ఆ తర్వాత వచ్చిన రీమేక్ మూవీ ఐనా 'చంటి' సూపర్ హిట్ అవ్వడంతో అగ్ర హీరోల లిస్ట్ లో చేరి పోయి స్టార్ హీరో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 'సుందరకాండ' మూవీలో టీచర్ గా నటించి మెప్పించారు.ఆతర్వాత చినరాయుడు,అబ్బాయిగారు,కొండవీటి రాజ, ముద్దుల ప్రియుడు.. లాంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్నారు.అలాగే 1995 తర్వాత వెంకటేష్-సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన సినిమాలతో మహిళా ప్రేక్షకులకి దగ్గరయ్యారు.వెంకటేష్-సౌందర్య జంటను తెర పై చూసేందుకు మహిళా ప్రేక్షకులు రిపీటెడ్ గా థియేటర్స్ కి వచ్చేవాళ్ళు.పవిత్ర బంధం, పెళ్లిచేకుకుందాం, ప్రేమించుకుందాం.. రా.! వంటి సినిమాలతో మాస్ ట్యాగ్ ను వదిలించుకుని ఫ్యామిలీ స్టార్ గా ఎదిగారు.సౌందర్యతో చేసిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ పండించిన కామెడీ ప్రేక్షకులను సీట్లలో కుర్చీనివ్వలేదు.ఆతర్వాత వెంకటేష్ లోని మూడో కోణం కూడా అభిమానులకు పరిచయం చేశారు. తన స్టైల్ తో కామెడీ చేసి అల్లరించేవాళ్ళు.
2001లో విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా క్లాస్ గా ఉన్న మాస్ ఆడియన్స్ సైతం థియేటర్ కి రప్పించి ప్రభంజనం సృష్టించింది మొత్తం మీద వెంకటేష్ అంటే కేరిర్ ప్రారంభం నుండి ఇప్పటిదాకా అన్నీ రకాల పాత్రలు చేసి అటు మాస్,ఇటు క్లాస్ ను అలరించారు.అలాగే తెలుగు సినిమాలలో మల్టీస్టారర్ సినిమాలు చేసి అభిమానుల్లో మళ్ళా కొత్త జోష్ నింపారు వెంకటేష్.అలాగే మలయాళ మూవీ 'దృశ్యం' రీమేక్ చేసి ఎవరు ఊహించని విధంగా సూపర్ హిట్ అందుకున్నారు.ఇప్పటికి తనదైన స్టైల్ లో కామెడీ కమ్ యాక్షన్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోదూసుకుపోతున్నారు.ఆయన సినీ ప్రయాణంలో ఆరు ఫిల్మ్‌ఫేర్,ఐదు నంది అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు.