పోర్న్ చూసేవారిలో రికార్డ్ సృష్టించిన ఆ దేశం?

frame పోర్న్ చూసేవారిలో రికార్డ్ సృష్టించిన ఆ దేశం?


 ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చాక అందులో కూడా ఇంటర్నెట్ వాడకం పెరిగాక అశ్లీల చిత్రాలు, పోర్న్ వీడియోలు.. సమాజానికి చాలా పెద్ద ముప్పుగా మారాయి. బాగా చదువుకున్నవారు, సాధారణ పనులు చేసుకునేవారు, యువత వీటికి అలవాటు పడి తప్పు దోవ పడుతున్నారు. ఇదే తీరు పిల్లల్లో కూడా బాగా వ్యాపిస్తోంది.ముఖ్యంగా అసలే విచ్చలవిడితనం ఎక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువత, మరీ ముఖ్యంగా పిల్లలు కూడా పోర్న్ వీడియోలు చూస్తుండడంతో ఆ దేశ ప్రభుత్వం తెగ ఆందోళన చెందింది.పరిష్కార మార్గం అంటూ ఓ ఆలోచన కూడా తెచ్చింది.యూరప్ లోని స్పెయిన్ బాగా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ ప్రజలు కూడా అప్డేట్ అయ్యి ఉంటారు. అయితే ఇలాంటి దేశంలో పోర్న్ వీడియోలను ప్రజలు ఎక్కువగా చూస్తున్నట్లు తేలింది. ఇక ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లగా.. పరిశీలనలో తేలింది ఏంటంటే.. అశ్లీల వీడియోలు చూసేవారిలో అత్యధికమంది మైనర్లు అని తేలింది. అంటే 15 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో సగంమంది పోర్న్ చూస్తున్నట్లు స్పష్టమైంది. ఇక దీన్ని అడ్డుకునేందుకు అక్కడ అధికారులు కొత్త ఆలోచన చేశారు. ‘కార్టెరా డిజిటల్‌ బీటా’ పేరిట ఓ ప్రత్యేక యాప్ ను తీసుకురావాలని వారు భావిస్తున్నారు. 


స్పెయిన్ లో దీన్ని ‘పజాపోర్టే’ అని పిలుస్తున్నారు.ఈ యాప్ ఒక మొబైల్‌ వ్యాలెట్‌ లా పనిచేస్తుంది. ఇక ప్రభుత్వం జారీ చేసే ఐదు అధీకృత ధ్రువపత్రాల్లో ఏదో ఒక దానికి దీనిని అనుసంధానించాలి. అలా చేస్తే వయసు ఎంతనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న మైనర్లకి పోర్న్ చూసే యాక్సెస్‌ లభించదు. ఇక ఆ వయసు దాటినవారికి మాత్రం నెలకు 30 క్రెడిట్లని అందజేస్తారు. ఒక్కో క్రెడిట్‌ కు ఒక క్యూఆర్‌ కోడ్‌ అనేది ఉంటుందట. ఇక పోర్న్ వెబ్‌ సైట్‌ కు యాక్సెస్‌ ఇచ్చేది ఈ క్రెడిట్లే.ఈ యాప్ ద్వారా.. పోర్న్ సైట్లు కచ్చితంగా యూజర్ల వయసును ధ్రువీకరించుకోవాలి. అయితే ఇది తప్పనిసరి ఏమీ కాదు. ఇతర మార్గాలతో కూడా వయసును నిర్ధారించుకోవచ్చు. కానీ తేల్చాల్సింది మాత్రం మైనర్‌ కాదని ధ్రవీకరించడం. ఇక ఈ ప్రక్రియను కచ్చితంగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ ఇన్‌ స్టిట్యూట్‌ కు ఇచ్చింది. ఇక ఈ పద్ధతిని సోషల్‌ మీడియా సైట్లకు కూడా విస్తరించాలని చూస్తున్నారు.అయితే దీనిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా? ప్రభుత్వ కొత్త విధానాలతో అశ్లీల చిత్రాలను చూడమని చెబుతున్నట్లుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మైనర్ల జీవితాన్ని రక్షించేందుకు ఇంతకంటే మెరుగైన మార్గం లేదని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: