భారీ నష్టాలను తెచ్చుకున్న టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే..?

frame భారీ నష్టాలను తెచ్చుకున్న టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ నష్టాలను మిగిల్చుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగా అత్యధిక నష్టాలను మిగిల్చుకున్న టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

అజ్ఞాతవాసి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా ద్వారా దాదాపు 55 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

బ్రహ్మోత్సవం : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , సమంత , ప్రణీత హీరోయిన్లుగా నటించగా ... శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ద్వారా 40 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

శక్తి : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో గోవా బ్యూటీ హీరోయిన్గా నటించగా మేహార్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

తుఫాన్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ద్వారా నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

రెబల్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో తమన్నా , దీక్షాసేత్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ద్వారా నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: