ఆ హీరోతో పాన్ వరల్డ్ మూవీ తీయనున్న కల్కి ప్రొడ్యూసర్?

Purushottham Vinay

తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీసిన కల్కి 2898 ఏడి మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. 


ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది ఈ నేపథ్యంలో కల్కికి భారీ లాభాలు వస్తున్న కారణంగా వైజయంతీ మూవీస్ తన చిత్రాలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే దుల్కర్ సల్మాన్ తో మరో పాన్ వరల్డ్ మూవీని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా దర్శకుడిగా మలయాళ దర్శకుడు పవన్ సాధినేని పేరు వినిపిస్తుంది.ఇతడు ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పటికే ప్రేమ్ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలు చేసాడు. ఇవీ పెద్ద విజయాలు కాకపోయినా కంటెంట్ బేస్డ్ చిత్రాలుగా నిలిచాయి.ఇంకా అలాగే ఆయన తెరకెక్కించిన కొన్ని వెబ్ సిరీస్ లకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా దయ అనే వెబ్ సిరీస్ కి ఓటీటీ అవార్డు కూడా ఈయన అందుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైజయంతీ ఈ దర్శకునిలో ఉన్న ప్రతిభను గుర్తించి దుల్కార్ తో సినిమా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: