టార్గెట్ రేవంత్:రివర్స్ గేర్ వేసిన తలసాని..మంత్రి పదవి కోసమేనా.?

Pandrala Sravanthi
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే నాయకుల మధ్య వలసల పర్వం నడుస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉండేటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర కీలక నాయకులంతా కాంగ్రెస్ లోకి రావాలని ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది ఎమ్మెల్సీలు, కీలక నాయకులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ విధంగా వలసల పర్వం కొనసాగుతున్న తరుణంలో  మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ లోకి రావాలని ట్రై చేస్తున్నారట. అయితే కాంగ్రెస్ లోకి రావాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ లో మంత్రి పదవి ఇస్తేనే వస్తానని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.  ఇదే తరుణంలో కాంగ్రెస్ అధినాయకుడైనటువంటి  రేవంత్ రెడ్డి మాత్రం మంత్రి పదవి ఇవ్వాలంటే కష్టం అంటూ  పక్కన పెట్టేసారట. 

అయినా పట్టు విడవని విక్రమార్కుడిలా  తలసాని తన ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అధిష్టానం చేతిలో ఉంటుంది. తలసాని రేవంత్ రెడ్డితో పని కాదని చెప్పి, ఆయన డైరెక్ట్ గా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో ప్రయత్నాలు చేస్తున్నారట. దీనికోసం  ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి సమాజ్వాద్ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తో  మంతనాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ బలపడాలంటే,  తప్పనిసరిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని, దీంతో నేను కాంగ్రెస్ పార్టీ బలవపడేందుకు ఎంతో సహకరిస్తానని శ్రీనివాస్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తో చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి అఖిలేష్ యాదవ్ కూడా  సుముఖంగానే ఉన్నారట.

అంతేకాదు ఈ విషయంలో రాహుల్ గాంధీపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే  తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి మంత్రి పదవి తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లో ఉన్న పెద్దలే ఎంతో ట్రై చేస్తున్నారు.  ఈ తరుణంలో తలసాని కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రి పదవి తీసుకుంటే మాత్రం, కాంగ్రెస్ పార్టీలో పెద్ద గొడవే జరుగుతుందనేది  అర్థమవుతుంది. మరి చూడాలి  శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ ను కాదని తన పంతం నెగ్గించుకుంటారా.? లేదంటే సైలెంట్ గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి అలా ఉంటారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: