కప్పు గెలవగానే కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్.. గంభీర్ ఏమన్నాడంటే?

praveen
గత కొన్నెళ్ల నుంచి వరల్డ్ కప్ టోర్నీలో తిరుగులేని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న భారత జట్టు.. కప్పు మాత్రం గెలవలేక అభిమానులను నిరాశ పరుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఫైనల్ వరకు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నప్పటికీ ఇక ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఓడిపోయి చివరికి విమర్శలు ఎదుర్కొంటుంది. అలాంటి టీమిండియా ఇక ఇప్పుడు అటు వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో విజయం సాధించింది. టైటిల్ విజేతగా నిలిచి విశ్వ విజేత అని మరోసారి పిలిపించుకుంది.

 ఈ క్రమంలోనే ఇలా టి20 వరల్డ్ కప్ టైటిల్ టీమిండియా గెలవడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే సమయంలో మొదటి మ్యాచ్ నుంచి ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ వరకు దూసుకువెళ్లి ఫైనల్లో గెలిచిన టీమ్ ఇండియా సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఇప్పటివరకు ఏ టీం కూడా ఇలా ఒక్క పరాజయం కూడా లేకుండా వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ గెలవలేకపోయింది అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ కప్ గెలిచాము అని ఆనందంలో ఉన్న అభిమానులందరికీ టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు షాక్ ఇచ్చారు.

 ఏకంగా తమ అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇలా రోహిత్ విరాట్ కోహ్లీ, వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడం పై గౌతమ్ గంభీర్ స్పందించాడు. దేశ ప్రజలు గర్వించేలా భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. హిట్ మ్యాన్, విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ టి20 నుంచి రిటైర్ అయ్యేందుకు ఇక వరల్డ్ కప్ గెలవడం కన్నా మంచి సందర్భం ఏమి ఉంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు. వన్డే, టెస్ట్ లలో వీరిద్దరూ విలువైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: