వైసీపీ: రేపు జైలుకు వైఎస్ జగన్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ... యాక్టివ్ జోన్ లోకి వస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు జగన్. అయితే ఎన్నికల రిజల్ట్స్ తర్వాత బెంగళూరు వెళ్ళిన.. జగన్ తిరిగి వచ్చారు. ఈ తరుణంలోనే... ఇవాల్టి నుంచి పార్టీ నేతలతో మళ్ళీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనేదాని పైన... చర్చించనున్నారు.

ఇందులో భాగంగానే జైలుకు వెళ్ళనున్నారు జగన్మోహన్ రెడ్డి. జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని... పరామర్శించేందుకు... నెల్లూరు జైలుకు  వెళ్తారు జగన్మోహన్ రెడ్డి. రేపు నెల్లూరు జైలుకు వెళ్లేలా... షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు కూడా ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న ఎన్నికల సమయంలో... ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసు, టిడిపి నేతలపై దాడులు  చేసిన కేసుల్లో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు.

అంతేకాదు 14 రోజుల రిమాండ్ ను కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి విధించింది కోర్టు. దీంతో నెల్లూరు జైలుకు ఆయనను తరలించారు. అప్పటినుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవరో ఒకరు... జైలుకు వెళ్లి పరామర్శిస్తున్నారు. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయ్ సాయి రెడ్డి లాంటి కీలక నేతలు పరామర్శించారు. ఇక రేపు జగన్మోహన్ రెడ్డి... నెల్లూరు జైలుకు వెళ్లబోతున్నారు.

రేపు ఉదయం 10 గంటల తర్వాత.... ప్రత్యేక విమానంలో తాడేపల్లి నుంచి నెల్లూరుకు బయలుదేరుతారు జగన్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని  పరామర్శించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కూడా.... జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారట. ఎలాంటి కష్టం వచ్చినా... అన్నల జగన్ మోహన్ రెడ్డి  వాడని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయబోతున్నారట. కాగా మాచర్ల నియోజకవర్గంలో... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఈవీఎంలు ధ్వంసం చేసి.. హైదరాబాద్ పారిపోయాడు పిన్నెల్లి రామ కృష్ణా రెడ్డి . ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: