కల్కి 2898 AD : ఆ ఇద్దరి కోసమే కల్కి చేశాను.. విజయ్ దేవరకొండ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈయన ఈ సినిమాలో నటించింది చిన్న పాత్రలోనే అయినప్పటికి ఈ పాత్ర ద్వారా ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ పాత్రికేయులతో మాట్లాడాడు. 

అందులో భాగంగా ఈయన కల్కి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... కల్కి సినిమా నాగ్ అశ్విన్ , ప్రభాస్ అన్న కోసమే చేశాను. కల్కి మూవీలో నేను చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ దానికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. 

ఇకపోతే విజయ్ తన కెరియర్ ప్రారంభం అయిన సమయంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి సినిమాలో కూడా ఈయన ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా ఇప్పటి వరకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మూడు సినిమాలలో కూడా విజయ్ దేవరకొండ నటించాడు. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలతో ఈయనకు మంచి గుర్తింపు ఏ స్థాయిలో వచ్చిందో... కల్కి సినిమా ద్వారా కూడా అలాంటి మంచి పేరు ఇతనికి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: