కల్కి 2898 AD : ఆ రేర్ మార్క్ కలెక్షన్లు టచ్ చేసిన కల్కి..!

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా విడుదల కోసం ఆయన అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్నో ఎదురు చూపుల నడుమ ఈ సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ లభించింది.

దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ వారు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అందులో 500 క్రోర్స్ అని రాసుకోచ్చారు. ఇక ఈ సినిమా మొన్నటికే 400 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా కొల్లగొట్టింది. దానితో ఈ సినిమా నిన్నటితో 500 కోట్ల మార్కును టచ్ చేసినట్లు అర్థం అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మరో కొన్ని వారాల పాటు ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈ సినిమా ఇదే స్థాయిలో దూసుకుపోతే ఈజీగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కను టచ్ చేసే అవకాశం ఉంది.

మరి కల్కి సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , మృనాల్ ఠాకూర్ , శోభన ఈ మూవీ లో ముఖ్య పాత్రలల్ నటించగా ... దిశా పటానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: