ఫైనల్ కి ముందు.. టీమిండియా షాకింగ్ డెసిషన్?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమ్ ఇండియా.. గత కొంతకాలం నుంచి మాత్రం వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో వెనకబడిపోయింది అని చెప్పాలి. అప్పుడెప్పుడో ధోని కెప్టెన్సీ లో గెలిచిన వరల్డ్ కప్ తప్ప ఇప్పటివరకు భారత జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది  కెప్టెన్లు మారిన కోచులు మారిన ఆ జట్టుకు వరల్డ్ కప్ గెలవాలి అనే కల మాత్రం నెరవేరడం లేదు. ఇక గత కొంతకాలం నుంచి టైటిల్ నెగ్గడానికి చేరువుగా వెళుతున్న టీమిండియా.. ఫైనల్ పోరులో ఓడిపోయి అటు అభిమానులు అందరిని కూడా ఎంతగానో నిరాశ పరుస్తుంది.

 ఇకపోతే 2024 t20 వరల్డ్ కప్ టోర్ని ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దీంతో నేడు సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. కాగా నేడు ఫైనల్ లో తలబడుతున్న రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ లో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ పోరు వరకు దూసుకు వచ్చాయి. అయితే తొలిసారి ఫైనల్ లో అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికా ఐసీసీ ట్రోఫీ ఆకలిని తీర్చుకోవాలని చూస్తుంటే.. 2023 ట్రోఫీని అడుగు దూరంలో కోల్పోయిన టీమ్ ఇండియా మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ ఎగరేసుకు పోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్ కి ముందు.. ఏ జట్టు అయిన అటు ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉంటుంది. కానీ టీమ్ ఇండియా మాత్రం తుది పోరుకు ముందు షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

 ఇటీవలే ఫైనల్ కి ముందు టీమిండియా కు సంబంధించి ఐసీసీ అధికారికంగా కొన్ని ప్రకటనలు విడుదల చేసింది. ఫైనల్ మ్యాచ్ కి ముందు భారత జట్టు విలేకరుల సమావేశం ఉండదని అందులో పేర్కొంది. దీంతో భారత జట్టు తన ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రాక్టీస్ రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఫైనల్ కి ముందు ప్రాక్టీస్కు బదులు విశ్రాంతి తీసుకోవాలని భారత జట్టు నిర్ణయించిందట. మరోవైపు దక్షిణాఫ్రికాకు సంబంధించి ఐసీసీ కూడా సమాచారం ఇచ్చింది. దక్షిణాఫ్రికా మాత్రం మ్యాచ్కి ముందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం.. ప్రాక్టీస్ స్టేషన్లో పాల్గొనడం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: