కల్కి హిట్ ఆర్ ఫ్లాప్ అయినా.. డార్లింగ్ కి ఆ తలనొప్పి మాత్రం పోదుగా..!

lakhmi saranya
ఈ ప్రభాస్ లైఫ్ స్టైల్ ఎవ్వరికి అర్థం కావడం లేదు. అటు పాజిటివిటీ జరిగిన ఇటు నెగెటివిటీ జరిగిన దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇలాంటి మంచి హీరోస్ కూడా ఉన్నారా అని కొన్ని కొన్ని సార్లు అనుమానం వస్తూ ఉంటది. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన తాజా చిత్రం కల్కి. ఈ చిత్రం విషయంలో ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో మన అందరికీ తెలిసిందే.
ఇక అదే విధంగా ఈ మూవీపై భారీ హైప్స్ కూడా నెలకొన్నాయి. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అందులో నో డౌట్. అయితే ఈ సినిమా హిట్ అయిన ఒకవేళ అటు ఇటుగా మారి కల్కి సినిమా ఫ్లాప్ అయినా ప్రభాస్ కి మాత్రం ఒక మేటర్ లో తలనొప్పులు తప్పక ఉన్నాయి. అదే ప్రభాస్ పెళ్లి మేటర్. ఈ సంవత్సరంలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటావని ప్రభాస్ తన పెద్దమ్మకి ప్రామిస్ చేశాడు. ఇక మరొక ఆరు నెలల్లో సంవత్సరం కి ఎండ్ కార్డ్ పడబోతుంది.
ఈ 6 నెలలో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరగాల్సిందే. ముహూర్తాలు అయితే నవంబర్లో ఉన్నాయి. అంటే నవంబర్ లోపు డార్లింగ్ తన మనసులో ఉన్న అమ్మాయి పేరుని అయిన బయట పెట్టాలి లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన అమ్మాయి పేరునైనా మీడియాకు చెప్పాలి. అది కూడా లేకపోతే ప్రభాస్ కొత్త తలనొప్పులు స్టార్ట్ అవుతాయి. దీంతో కలిపి సినిమా హిట్ అయిన ఆనందాన్ని ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేడు ప్రభాస్. ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా ఆ బాధను ఎక్కువ కాలం తీసుకోలేడు. ఎందుకంటే వెంటనే ప్రభాస్ పెళ్లి మ్యాటర్ని మళ్లీ మీడియా టార్గెట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: