30 ఏళ్ల కెరియర్లో.. రమ్యకృష్ణ ఎంత సంపాదించిందో తెలుసా?

praveen
తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మరీ ముఖ్యంగా 90 లలో ఏకంగా తన కంటిచూపుతోనే ప్రేక్షకులను భయపెట్టిన నీలాంబరిగా.. తన కోర చూపులతో కుర్ర కారు మతిపోగొట్టిన రొమాంటిక్ హీరోయిన్ గా.. హీరోల అందరికీ దీటుగా నటించి గుర్తింపును సంపాదించుకున్న నటిగా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగి హవా నడిపించింది. ప్రస్తుతం  టాలీవుడ్ లో స్టార్ సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న అందరితో కూడా జోడి కట్టింది.

 ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శివగామిగా నటించి తన మాటే శాసనం అంటూ అందరి మనసుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్నవయసులోనే నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఎనిమిదో తరగతి చదువుతూనే ఏకంగా సినిమాలో హీరోయిన్గా నటించింది. అందరూ హీరోలు కేవలం హీరోయిన్ పాత్రలతోనే సరిపెట్టుకుంటే.. రమ్యకృష్ణ మాత్రం విలన్ పాత్రలు కూడా చేస్తూ తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగించింది అని చెప్పాలి.

 విలన్ హీరోయిన్ పాత్రలు మాత్రమే కాదు ఎంతో మంది యంగ్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా ఆడి పాడింది రమ్యకృష్ణ.  దాదాపుగా 37 నుంచి సినీ పరిశ్రమలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సినిమాల్లో నటించి రమ్యకృష్ణ ఎన్ని ఆస్తులను కూడబెట్టుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా రమ్యకృష్ణ నికర ఆస్తుల విలువ 90 కోట్ల వరకు ఉంటుందట. ఇప్పుడున్న నటీమణులు అత్యధిక పారితోషకం తీసుకునే సీనియర్ హీరోయిన్ కూడా రమ్యకృష్నే. ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు అంటే స్టార్ హీరోయిన్ రేంజ్ లో పారితోషకం పుచ్చుకుంటుందట. ఇక వాణిజ్య ప్రకటనల కోసం కూడా భారీగానే వసూలు చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: