ఓటిటి లోకి వచ్చేస్తున్న వరలక్ష్మి లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ శబరి.. ఎప్పుడంటే..!?

Anilkumar
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే రాజాగా ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమా శబరి. అనిల్  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు గణేష్ వెంకట్రామన్ శుశాంక్ కీలకపాత్రలో నటించారు. అయితే విడుదలకు ముందే టీజర్ ట్రైలర్ పోస్టర్స్ తో భారీగా అంచనాలను పెంచేసిన ఈ సినిమా ప్రమోషన్స్ సైతం బాగానే

 నిర్వహించారు. కాగా మే 3 న  విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దానికి తోడు ఆ సినిమా విడుదల సమయం లో వేరే సినిమాలు కూడా విడుదల కావడంతో అది చివరికి బాగా మైనస్ అయింది  అని చెప్పాలి. కాగా ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అన్న కామెంట్లు సైతం వినిపించాయి. అంతేకాదు సినిమాలో ఊహించని స్థాయిలో ట్విస్ట్ లు ఉన్నాయని అంటున్నారు. అయితే థియేటర్స్ లో ఎవరేజ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి రాబోతున్నట్లుగా

 తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లుగా సమాచారం. అయితే జూన్ 14న శబరి సినిమా ఓటిటి లోకి రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇస్తారట చిత్ర బృందం. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ నిర్మించిన ఈ సినిమాలో మైమ్ గోపి మధు నందన్ సునయన కేశవ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. మరి థియేటర్స్ లో మోస్తారుగా ఆడిన ఈ సినిమా ఓటీటీ లో అయినా మంచి టాక్ తెచ్చుకుంటుంద అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: