మాస్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్..!?

Anilkumar
యూత్ ఫుల్ సినిమాలు, కుటుంబ కథా సినిమాలు కామెడీ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఎప్పుడు కూడా ప్రయోగాత్మక సినిమాల జోలికి వెళ్లడు ఈ యంగ్ హీరో. అలా గతంలో ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే తాజాగా శర్వానంద్ చేస్తున్న సినిమా మనమే. ఇక ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో వస్తుంది. జూన్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు

 శర్వానంద్. అయితే  ఇప్పుడు శర్వానంద్ మనమే సినిమా తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు అన్న దానిపై సోషల్ మీడియాలో తెగ వార్తలు వినబడుతున్నాయి.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మనమే సినిమా తర్వాత శర్వానంద్ మాస్ సినిమాలు తెరకెక్కించే సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. నిజానికి సంపత్ నంది మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ కాంబినేషన్లో ఇప్పటికే గంజా శంకర్ అనే సినిమా రావాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ

 సినిమాను నిర్మించాలి. కానీ కొన్ని కారణాలవల్ల  ఆగిపోయింది. దీంతో నెక్స్ట్  ఏ హీరోతో సినిమా చేయాలి అని హీరోను వెతిక్కుంటున్న డైరెక్టర్  శర్వానంద్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక విచిత్రమైన కాంబినేషన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకవైపు సాఫ్ట్ గా ఫ్యామిలీ సినిమాలు చేసే హీరో శర్వానంద్. మరోవైపు పక్క మాస్ సినిమాలు చేసే డైరెక్టర్ సంపత్ నంది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఊహకి కూడా అందడం లేదు. అందుకే ఇప్పుడు సాఫ్ట్ హీరో శర్వానంద్ తో మాస్ డైరెక్టర్ సంపత్ నంది ఎటువంటి సినిమా చేస్తాడో అని ఇప్పటినుండే ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి శరవన్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ రెడీ చేస్తారు. అన్నది ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇక పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: