పుష్ప 2: సెకండ్ సాంగ్.. అంత కొత్తగేమి లేదు.. కానీ..?

Purushottham Vinay
పుష్ప 2 ఫ్యాన్స్‌ కు అదిరిపోయే ట్రీట్‌ రానే వచ్చేసింది. ఎందుకంటే పుష్ప 2 నుంచి శ్రీవల్లి సాంగ్ వచ్చేసింది. టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2.‘పుష్ప 2 ‘ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. మొదట దీనికి మిశ్రమ స్పందన వచ్చినా కానీ వినగా వినగా బాగానే ఎక్కేసింది. రీల్స్ కి సెట్ అయ్యే డ్యాన్స్ ఈ పాటలో ఉండటం వల్ల  అందరూ ఈ పాటని బాగానే ఓన్ చేసుకుని బాగానే విన్నారు.అది ‘పుష్ప’ ఆటిట్యూడ్ ని తెలిపే సాంగ్ కాబట్టి మెల్లిగా అందరికి నచ్చేసి హిట్ అయిపోయింది. ఇక రెండో సింగిల్ కూడా తాజాగా ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే ఇది ఒక రొమాంటిక్ సాంగ్. పైగా ఈ లిరికల్ సాంగ్ విశేషమేమిటంటే.. షూటింగ్ స్పాట్ లో టీం అంతా కలిసి ఈ సాంగ్ కి డాన్సులు చేస్తున్నట్టు విజువల్స్ జోడించారు.‘వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసి పిల్లవాడు నా వాడు, వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు మా వాడు’ అంటూ ఈ పాట క్యాచి లిరిక్స్ తో మొదలైంది.


‘సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే లిరిక్ వచ్చినప్పుడు ఇంకా మంచి హై ఇస్తుంది. శ్రీవల్లి… అంటే పుష్ప భార్య పైకి కఠినంగా కనిపించే అతని మనసు ఎలా ఉంటుంది? అనేది వర్ణిస్తూ ఈ రొమాంటిక్ పాట ని రాశారు ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్.బాలీవుడ్ ఫేమస్ సింగర్ శ్రేయ గోషల్ పాడటం వల్ల ఈ పాట ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమె ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఈ పాట పడినట్టు పూర్తిగా స్పష్టమవుతుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ ఏమీ అంత కొత్తగా లేదు.. కానీ లిరిక్స్ మాత్రం కొంచెం క్యాచీగా ఉండటంతో 2 , 3 సార్లు విన్న తర్వాత పాట ఖచ్చితంగా ఈ పాట ఎక్కేసే ఛాన్స్ ఉంది. పైగా ఇది సిట్యుయేషనల్ సాంగ్ కాబట్టి.. సినిమా చూస్తున్నప్పుడు లేదా సినిమా చూశాకా.. జనాలకు ఇంకా బాగా నచ్చొచ్చు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: