డార్లింగ్ అభిమాని మృతి.. ప్రభాస్ చేసిన పనికి షాక్..!

lakhmi saranya
పాన్ ఇండియా స్టార్ రెబల్స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వరస హ్యాట్రిక్ సినిమాలతో దూసుకుపోతూ బిజీ లైఫ్ని కొనసాగిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో కల్కి మూవీ కూడా ఒకటి. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా ఏర్పాటులో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇక ఈ మూవీలో దీపికా పదుకొనే ప్రధాన హీరోయిన్గా నటించింది. అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
కల్కి ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తన సంపాదనలో కొంత భాగం దానధర్మాలకు కేటాయించడం ప్రభాస్ గొప్పతనం. అప్పుడు కోవిడ్ సంక్షేభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభాస్ భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఇక ఇటీవల తెలుగు డైరెక్టర్ అసోసియేషన్ కి రూ. 35 లక్షలు విరాళంగా ఇచ్చారు. తన తోటి నటీనటులకు అరుదైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారని ప్రభాస్ తో పని చేసిన నటీనటులు మరియు హీరోయిన్స్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా కరీంనగర్ జిల్లా ప్రభాస్ ఫ్యాన్ అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఇటీవల మరణించారు. అతని మృతి వార్త తెలుసుకున్న ప్రభాస్ ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించమని పిఎ రామకృష్ణ ను శనివారం రమేష్ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపారు. అలాగే ఆయన పేరుట అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా ప్రభాస్ పై ప్రశంసలు వర్షం కురుస్తుంది. ప్రభాస్ అభిమాని కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోసారి ప్రభాస్ గొప్పతనం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. సినిమాల ద్వారా సంపాదించడమే కాదని పెట్టడం కూడా వచ్చిన వారే రాజు అవుతాడని పలువురు పొగుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: