ఈ వారం తెలుగు భాషలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు తెలుగు భాషలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి ..? ప్రస్తుతం అవి ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ప్రసన్న వదనం : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం వరుస విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సూహస్ హీరో గా రూపొందిన ఈ మూవీ ధియేటర్ లలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో  స్ట్రీమింగ్ చేస్తున్నారు.
రత్నం : కోలీవుడ్ నటుడు విశాల్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించాడు. ప్రియ భవాని శంకర్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాలో సముద్ర ఖని , మురళి శర్మ ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే థియేటర్ లలో భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి బోల్తా కొట్టిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
ఆరంభం : కొన్ని రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓ టి టి  లో ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: