నిర్మాత చేతిలో మోసపోయానంటూ షాకింగ్ నిజాలు బయట పెట్టిన నమిత..!!

murali krishna
హీరోయిన్‌ నమిత.. ఈపేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సొంతం సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో తన నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను బోల్తా కొట్టించడం చాలా సులువు. ఏదో ఒక మాయమాటలు చెప్పి వారిని సినిమాలకు సైన్ చూపిస్తారు. ఆ స్టార్ హీరో నటిస్తున్నాడు అని, కథలో మీరే మెయిన్ అని, ఈ సినిమా చేస్తే నెక్స్ట్ స్టార్ మీరే అని.ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మి ఒక సినిమాకు సైన్ చేస్తే అంతే సంగతులు. సినిమా ఒప్పుకున్నప్పుడు ఒకలా.. సినిమా రిలీజ్ అయ్యాకా ఇంకొకలా కనిపిస్తూ ఉంటుంది. అసలు సినిమాలో కొన్నిసార్లు ఆ క్యారెక్టర్స్ కూడా లేకుండా చేస్తారు. హీరోయిన్స్ ను నమ్మించి మోసం చేస్తారు.నేను కూడా ఇలానే మోసపోయాను అని హాట్ బ్యూటీ నమిత చెప్పుకొచ్చింది. తెలుసునా.. తెలుసునా అంటూ సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. దిల్ దివానా అంటూ జెమిని సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో కొలువై ఉండిపోయింది. సన్నగా ఉన్న నమిత ఒక్కసారిగా బొద్దుగా మారి తమిళ్ తంబిలకు దేవతలా మారింది. ఇక అక్కడ తన సత్తాచాటింది. కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ వీరేంద్ర చౌదరిని వివాహమాడి ఇద్దరు బిడ్డలకు తల్లిగా మారింది.
అయితే నమిత తెలుగులో కన్నా.. తమిళ్‌ లోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. కాగా,తమిళనాట ఈమె విజయకాంత్‌ మా అన్న చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. దిగన్, ఇంగ్లీస్ఖరన్, చాణకియ, బంబారా కన్నాలే, కోయంబత్తూర్ బ్రదర్స్, పచ్చ ఉద్దీ, వయారి, నాన్ అవన్ అలై, అజ్జయ తమిళ్ మగన్ వంటి సినిమాల్లో నటించింది. అలా తెలుగు, తమిళంలో మంచి ఆదరణ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ నేపథ్యంలో నటి నమిత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఇంటర్వ్యూ వైరల్‌ గా మారింది.ఇక ఆ ఇంటర్వ్యూలో నమిత మాట్లాడుతూ.. ధనుష్ సినిమాలో కాల్షీట్ అడిగి ఒక నిర్మాత మోసం చేశాడని చెప్పింది. కాగా, 2006లోని ఓ సినిమాలో నటించమని నన్ను అడిగారు. ఇక ఆ సినిమా పేరు చెప్పనక్కర్లేదు, ఆ సినిమా నిర్మాత.. ఈ సినిమాలో ధనుష్‌ సరసన నేను నటించాలని నా దగ్గర కాల్షీట్ తీసుకున్నాడు. కానీ ఆఖరికి నిర్మాత కజిన్‌ ఆ సినిమాలో హీరోగా నటించాడు. ఆ విషయం తెలియగానే చాలా బాధపడి సగంలోనే సినిమా నుంచి బయటకు వచ్చేశా. ఆపై ఎలాగోలా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. అయితే ఈ విషయం మీద అప్పట్లో నిర్మాతల మండలికి, నటీనటుల మండలికి ఫిర్యాదు చేశాను' అంటూ నటి నమిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మరి, నిర్మాత చేతిలో నమిత అలా మోసపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: