అఫిషియల్ : "లవ్ మీ" ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు ఆ సమయానికి ఆ ప్రదేశంలో..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు ఆశిష్ రెడ్డి తాజాగా లవ్ మీ అనే సినిమాలో హీరోగా నటించాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మే 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను చాలా జోరుగా ముందుకు సాగిస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ లభించింది. ఆ విషయాన్ని మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది.

ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు అనగా 23 వ తేదీన ఉదయం 11 గంటలకు హోటల్ దాసుపల్లి , హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయం అందుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: