షాక్: ఆస్పత్రి పాలైన షారుక్ ఖాన్.. ఏం జరిగిందంటే..?

Divya
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న షారుఖ్ ఖాన్ రేంజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.. గతంలో వసప్లాకులతో సతమతమవుతున్న సమయంలో పఠాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు షారుక్ ఖాన్. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు షారుఖ్ ఖాన్ ఆసుపత్రి పాలైనట్లుగా తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా ఈ రోజున అహ్మదాబాద్ లోని కేడి హాస్పిటల్ లో చేరినట్లుగా సమాచారం.. షారుక్ ఖాన్ కు డిహైడ్రేషన్ కారణంగానే అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి షారుక్ ఖాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఐపీఎల్ లో చాలా బిజీగా ఉన్నారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచెస్ యజమాని గా షారుఖ్ ఖాన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా మ్యాచ్లకు అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ సమయంలోనే హిట్ స్ట్రోక్ తగిలినట్లుగా సమాచారం. దీంతో డిహైడ్రేషన్తో ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు షారుఖ్ ఖాన్.. ఇందుకు సంబంధించి షారుఖ్ ఖాన్ టీమ్ అధికారికంగా ఏమైనా ప్రకటిస్తుందేమో అన్నట్లుగా అటు నేటిజన్స్ అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

షారుక్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే జవాన్, ఢంకీ  సినిమాతో ప్రేక్షకులను చివరిగా అలరించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో తన తదుపరి చిత్రాన్ని కూడా ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు షారుక్ ఖాన్. వరుసగా భారీ కలెక్షన్స్ తో తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు షారుక్ ఖాన్. మరి షారుక్ ఆరోగ్యం ఎలా ఉందని విషయంపై టీమ్ స్పందిస్తుందేమో లేకపోతే షారుఖ్ ఖాన్ స్పందిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: