'రక్షణ' టీజర్ వచ్చేసింది.. అదరగొట్టిన పాయల్..!

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. మొన్నటి వరకు రొమాంటిక్ కథలతో ముందుకు వెళ్లిన ఈ బ్యూటీ ఇప్పుడు యాక్షన్ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రక్షణ అనే ఒక యాక్షన్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుండి టీజర్ సైతం విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది.

 అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పాయల్. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ అప్డేట్స్ విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా విడుదల డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పాయల్ ఈ సినిమాకి సంబంధించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్  టీజర్ ను విడుదల చేశారు. ఇక ఇందులో పాయల్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసింది. ఫైటింగ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేసింది పాయల్. ఇకపోతే ఒక కేసుకి

 సంబంధించిన ఇన్వస్టిగేషన్ ఆఫీసర్ గా పాయల్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. మొత్తానికి టీజర్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది అని చెప్పాలి . దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది పాయల్.. ఇక ఈ సినిమాలో మానస్‌, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి సంగీతాన్ని అందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: