లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఇలా ఈజీగా తెలుసుకోండి?

Purushottham Vinay
లోక్‌ సభ ఎన్నికల ఫలితాల గురించి దేశావ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఫలితాలు అందరిలో కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక రేపు (జూన్ 4న ) పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.దేశ వ్యాప్తంగా కూడా ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లని చేసింది. ఇంకా కౌంటింగ్ సూచనలు చేసింది.543 లోక్ సభ నియోజకవర్గాలు, ఏపీ ఇంకా తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళవారం నాడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ అనేది ప్రారంభం కానుంది. కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మంగళవారం నాడు ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ అయిన results.eci.gov.in ను ఓపెన్ చేస్తే ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకోవచ్చు. దీంతో చాలా వెబ్ సైట్లు, టీవీ ఛానెళ్లు లైవ్ ప్రసారం చేయనున్నాయి. మహారాష్ట్ర లో ఎన్నికల ఫలితాలను చూసేందుకు ఏకంగా థీయేటర్ల యజమానులు తమ థియేటర్లలో లైవ్ షోలను కూడా ఏర్పాటు చేశారు. ec అధికారిక వెబ్‌సైట్‌ results.eci.gov.in ను ఓపెన్ చేసి సాధారణ ఎన్నికలపై క్లిక్ చేసీ మీ రాష్ట్రం, నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాలను చాలా సులభంగా పొందొచ్చు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఇలా ఈజీగా తెలుసుకోండి..ఇక ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, లోక్‌సభ నియోజకవర్గం RO/ARO నమోదు చేసిన డేటా ప్రకారం కౌంటింగ్ ట్రెండ్‌ ఇంకా అలాగే ఫలితాలు ప్లే స్టోర్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోగలిగే ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ లు కూడా అందుబాటులో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: