3 రోజుల్లో "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" కలెక్షన్స్ ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశం నిర్మాణంలో , కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అనగా 31 వ తేదీన బారి ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల్లో ఈ సినిమా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. అలాగే మొత్తం ఈ మూవీ కి ఎన్ని కలెక్షన్ లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ కావాలి అంటే ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్ లను రాబట్టాలి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి 3 రోజుల్లో నైజాం ఏరియాలో 2.47 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.28 కోట్లు ,ఉత్తరాంధ్ర లో 79 లక్షలు , ఈస్ట్ లో 52 లక్షలు , వెస్ట్ లో 42 లక్షలు , గుంటూరు లో 46 లక్షలు , కృష్ణ లో 39 లక్షలు , నెల్లూరు లో 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.60 కోట్ల షేర్ ... 11.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 3 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 95 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్  , 14.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 3 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: