బాబుకు పవన్ కీలకం కానున్నాడా..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికలలో భాగంగా ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగగా , తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. వై సీ పీ పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగిన సమయంలో టి డి పి మాత్రం జనసేన , బి జె పి తో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలలో టి డి పి అభ్యర్థులకు టికెట్లు దక్కలేదు.

అలాంటి సమయం లో టి డి పి కి అద్భుతమైన క్రేజ్ ఉంది. వై సీ పీ లాగా టి డి పి కూడా ఒంటరిగా బరిలోకి దిగిన గెలిచేసత్తా ఉంది. అలాంటప్పుడు ఈ పొత్తు ఎందుకు అని అన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగానే ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఇకపోతే మే 13 వ తేదీన జరిగిన ఎలక్షన్లకు సంబంధించిన ఫలితాలు రేపు అనగా జూన్ 4 వ తేదీన విడుదల కానున్నాయి. అంతలోపు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నివేదికలను విడుదల చేశాయి.

ఇందులో భాగంగా జనసేన పార్టీకి చాలా సీట్లు రానున్నట్లు ప్రకటించాయి. జనసేన పార్టీకి పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలను , రెండు పార్లమెంట్ స్థానాలను ఇచ్చారు. అందులో భాగంగా జనసేన పార్టీ కి 14 నుండి 20 వరకు అసెంబ్లీ స్థానాలు , రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలే కనుక నిజం అయితే చంద్రబాబు నాయుడు కు పవన్ కళ్యాణ్ కీలకంగా మారతాడు. ఆయన పొత్తు కూడా సూపర్ సక్సెస్ అయినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: