లక్ అంటే జాన్వీదే.. ఆఫర్స్ మీద ఆఫర్స్ కొట్టేస్తుందిగా..!!

murali krishna
బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడో తెలిసిందే.ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుందని తెలియడంలో ఫ్యాన్స్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీ లెవెల్ లో వర్కౌట్లు చేస్తూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. గత కొంతకాలంగా మహేష్ బాబు తన లుక్ పై ఫోకస్ పెట్టి పూర్తిగా స్టైల్ మార్చుకొని సంగతి తెలిసిందే.మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమా ఈసారి రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడట అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం గురించి కొద్ది రోజులుగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ హాలీవుడ్ నటి నటించబోతుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ బాబు సరసన ఓ బాలీవుడ్ బ్యూటీ నటిస్తుందంటూ మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకి అ లక్కి బ్యూటీ ఎవరో కాదు దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్‌.ఈమెను మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారంటూ తెలుస్తుంది. అయితే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తన సినిమా ఒకటి కూడా రిలీజ్ కాకముందే ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. మొదట టాలీవుడ్లో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా ఛాన్స్ కొట్టిన ఈ చిన్నది.. తర్వార రాంచరణ్ ఆర్ సి 16 సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో కూడా జాన్వికపూర్ ఛాన్స్ కొట్టేసింది అంటూ తెలియడంతో అమ్మడు నక్కతోక తొక్కి టాలీవుడ్‌కు అడుగుపెట్టినట్టుందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: