కల్కి బజ్ మాములుగా లేదు.. బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్ అన్నీ ఔట్?

Purushottham Vinay
ప్రభాస్‌ తాజా పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 ఏడీ' పై అంచనాలు ఆకాశాన్ని తాకేసాయి. పాన్ వరల్డ్‌ మూవీ అంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్ చేసిన ప్రకటనతో పాటు ఇప్పటికే విడుదల అయిన గ్లిమ్స్ ఇంకా పోస్టర్స్ ఇది ఓ ఇండియన్ సినిమాలా కాకుండా హాలీవుడ్‌ సినిమాలా ఉంది అనేలా చేశాయి.కల్కి మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ కూడా ఆ రేంజ్‌ లోనే జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమాను ఎన్నికలు, ఐపీఎల్‌ ఇతర కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. జూన్‌ చివరి వారంలో ఈ మూవీని విడుదల చేసేందుకు అధికారికంగా ప్రకటన వచ్చింది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి అన్ని బిజినెస్ లు క్లోజ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీ డీల్‌ ను చిత్ర నిర్మాతలు క్లోజ్ చేశారు అంటూ సమాచారం అందుతోంది. సినిమా బడ్జెట్‌ లో సగం కంటే ఎక్కువ ఓటీటీ బిజినెస్ తోనే వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ను బట్టి అర్థం అవుతుంది.హిందీ వర్షన్ తో పాటు ఉత్తరాది భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు గాను ఏకంగా రూ.175 కోట్ల కు  నెట్‌ ఫ్లిక్స్ కు అమ్మేయడం జరిగింది.


ఇక సౌత్‌ లోని అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను ఏకంగా రూ.200 కోట్లకు గాను అమెజాన్ కు అమ్మేయడం జరిగిందట. రెండు ఓటీటీలు కలిపి కల్కి సినిమా నిర్మాతలకు ఏకంగా రూ.375 కోట్ల ను ఇవ్వబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి ఓటీటీ బిజినెస్ దక్కించుకున్న సినిమా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు వచ్చిన  బజ్ కారణంగా ఈ స్థాయి బిజినెస్ అయ్యింది.  అమితాబచ్చన్‌, దీపికా పదుకునే, దిశా పటానీతో పాటు ఇంకా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నటించడం వల్ల అన్ని భాషల ప్రేక్షకుల్లో కూడా కల్కి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ఖచ్చితంగా 2 వేల కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఖాయం అంటున్నారు. రేపు ఈ సినిమాకి సంబంధించిన పెద్ద ఈవెంట్ జరగనుంది.టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ అద్భుతంగా వచ్చాయి అంటూ మేకర్స్‌ తో పాటు ప్రొడక్షన్ టీం కూడా చెబుతున్నారు. ఒక కొత్త ప్రపంచంలోకి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తీసుకు వెళ్లడంతో పాటు మంత్రముగ్దులను చేయడం ఖాయమట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: