Jr. ఎన్టీఆర్: టీడీపి నేత వర్మ చేసిన వ్యాఖ్యలపై.. ఫ్యాన్స్ ఫైర్..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటలలో రాబోతున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ గురించి పలు రకాల వార్తలు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పైన చేసిన వాక్యాలు అభిమానులను సైతం ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి.. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ డెబిట్ లో వర్మ జూనియర్ ఎన్టీఆర్ పైన ఇలా మాట్లాడడం జరిగింది.. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీలోకి రావచ్చు.. ఆయన సినిమాలు మానేసి ఫుల్ టైం వస్తేనే పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబెడతామంటూ ఎద్దేవా చేశారు.

లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కి అసలు పోలిక ఉండదని లోకేష్ సిన్సియర్గా పార్టీ కోసం పని చేస్తున్నారని ఆయన పాదయాత్ర కూడా చేశారని దీంతో ఎంతోమందిని సభ్యత్వం టిడిపి పొందేలా చేశారు కార్యకర్తలకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని కూడా లోకేష్ అమలు చేశారని వెల్లడించారు. అంతేకాకుండా టిడిపి పార్టీ లోకేష్ కీలకంగా మారారని కూడా వర్మ తెలియజేశారు. భయపడి ఇంట్లో కూర్చుంటే ఎవరు కూడా కుదరదని ఇన్ డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి వర్మ ఇలాంటి వాక్యాలు చేయడంతో అభిమానులు ఫైర్ అయ్యారు

వర్మ ఆడియో పై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. వర్మ నీ ఏకి పారేస్తూ అసలు ఏపీలో వర్మాకే టికెట్ దొక్కలేదని మళ్లీ ఆయన మాట్లాడడం ఇది విడ్డూరంగా ఉందంటూ ఫైర్ అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉంటూ సినిమాలు ఎందుకు చేస్తున్నారో అంటూ ఫైర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. లోకేష్ గురించి అంతగా చెబుతున్న వారు లోకేష్ పార్టీ కోసం ఏం పని చేశారు అసలు చెప్పాలి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్మను కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏదో ఒక రోజు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా తమ పార్టీని కైవసం చేసుకుంటారని కూడా హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా దీనివల్ల ఇబ్బందులు పడతారని కూడా హెచ్చరిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: