అందుకే నేను ఎక్కువ తెలుగులో మాట్లాడను...కాజల్..!

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కాజల్ అగర్వాల్ పోయిన సంవత్సరం భగవంత్ కేసరి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. పెళ్లి తర్వాత తెలుగు లో కాజల్ కి ఇదే మంచి కమర్షియల్ విజయం. ఇక తాజాగా ఈ నటి సత్యభామ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందింది. ఈ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కాజల్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మరికొన్ని విషయాలను కూడా తెలియజేస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను ఎందుకు ఎక్కువగా తెలుగు మాట్లాడను అనే విషయం గురించి చెప్పుకొచ్చింది. కాజల్ తాజాగా మాట్లాడుతూ ... నాకు తెలుగు చాలా బాగా వస్తుంది. కాకపోతే మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది కరెక్టా..? కాదా అనే అనుమానాలు నాకు వ్యక్తం అవుతూ ఉంటాయి. అందుకే అందరి ముందు నేను ఎక్కువగా తెలుగు లో మాట్లాడను అని ఈమె చెప్పింది.

ఇక నాకు తెలుగు బాగా వచ్చిన దాన్ని అంతా నేను మనసులోనే ఉంచుకుంటాను. మరికొన్ని రోజుల్లోనే సత్యభామ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అందులో నేను తెలుగులో మాట్లాడి చూపిస్తా అని అంది కాజల్. అలాగే తన అందం గురించి కాజల్ చెబుతూ హ్యాపీగా ఉంటూ పక్కన వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచడమే నా బ్యూటీ సీక్రెట్ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇకపోతే కాజల్ సత్యభామ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: