కంగువా "ఓటీటీ" లో ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య ప్రస్తుతం కంగువా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని దిశ పటని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే ఈ సంవత్సరం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కాకపోతే ఏ నెలలో , ఏ తేదీన విడుదల చేయబోతున్నాం అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని నవంబర్ 1 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనను మరికొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ ని మొదటి నుండి చాలా భాషలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని ఏకంగా 10 భాషలలో థియేటర్ లలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇలా పది భాషలలో థియేటర్ రిలీజ్ అనగానే ఎంతో ఆసక్తిని ప్రేక్షకులు చూపించారు. ఇకపోతే ఈ మూవీ ఓ టి టి రిలీజ్ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

ఈ మూవీ ని ఏకంగా 30 భాషలలో ఓ టీ టీ లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సంస్థ వారు కూడా ఈ మూవీ ని 30 భాషలలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: